ఆరు బయట చెత్త వేస్తే జరిమాన..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఆరు బయట చెత్త వేస్తే జరిమాన..!
– తాండూరు మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్
– కాలనీలో రూ. 2 వేల జరిమానా వసూలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ వాసులకు మున్సిపల్‌ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరైనా ఆరుబయట చెత్త వేస్తే జరిమాన తప్పదని తాండూరు మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. శనివారం తాండూరు మున్సిపల్ కమిషనర్ శంకర్ సింగ్ పట్టణంలోన సీసీఐ కాలనీలో శానిటరి ఇనుస్పెక్టర్ ఉమేష్‌ కుమార్ తదితరులతో కలిసి పర్యటించారు. కాలనీల పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. కాలనీలో ఆరు బయట చెత్త వేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఆరు బయట చెత్త వేసిన వారికి జరిమానాలు విధించాలని శానిటరీ ఇనుస్పెక్టర్ ఉమేష్‌ కుమార్‌ను ఆదేశించారు.

ఈ మేరకు కాలనీలో పలు దుకాణాల ముందు ఆరు బయట చెత్త వేసినందుకు వివిధ కిరాణ దుకాణదారులకు జరిమానలు విధించారు. పలువురు దుకాణదారుల నుంచి రూ.2వేల వరకు జరిమానాలను వసూలు చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ శంకర్‌ సింగ్ మాట్లాడుతూ పట్టణంలో ఆరు బయట చెత్త వేయడం పద్దతి కాదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగానే జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రజలు ఆరు బయట చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జవాన్లు ఉన్నారు.