తెలంగాణలో 8 కొత్త మెడికల్ కాలేజీలు
– ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
– చేరువకానున్న మరో 10వేల సీట్లు
హైదరాబాద్, దర్శిని ప్రతినిది: మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్తగా మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సర్కార్ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఈ కొత్త కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నారు. కేసీఆర్ పాలనలో గత 9 ఏళ్ల కాలంలో మొత్తం 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. కొత్త కాలేజీలు ఏర్పాటైతే ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అరుదైన రికార్డు దక్కించుకుంది. దీంతో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం త్వరలోనే నెరవేరబోతోంది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10 వేలకు చేరువకానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం సాకారమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది అని మంత్రి హరీశ్రావు అభివర్ణించారు.
ఇది కూడా చదవండి…


