పేపర్ లీక్‌లో టీచర్లకు ఊరట..!
– సర్వీసు తొలగింపు ఉత్తర్వులు రద్దు
– ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
– ఇందులో నిజమెంతంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో ప్రధాన నిందుతులకు హైకోర్టు ఉపశమనం అందించింది. తాండూరు కేంద్రంగా ప్రశ్నాప్రత్నం లీకేజీ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్ రెండో వారంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాల నుంచి మొదటి రోజు తెలుగు పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమయ్యింది. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పెద్ద కలకలం రేపింది. పరీక్ష ముగియకుంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బందెప్ప అదే పాఠశాలలో మొదటి రోజు పరీక్షకు రిలీవర్‌గా హాజరయ్యారు.
పరీక్ష మొదలైన కాసేపటికే ఆయన ఫోన్ ద్వారా తాండూరు మండలం చెంగోల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సమ్మప్పకు వాట్సాప్‌లో పంపారు. పొరపాటున మీడియాకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులో కూడా షేర్ కావడంతో విషయం బయటకు వచ్చింది. పరీక్షలు రాసే విద్యార్థులకు చీట్టిలు అందించాలని ఉద్దేశంతో ఈ తతంగం నడిపించారని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ మేరకు పోలీసులు ఉపాధ్యాయులు బందెప్ప, సమ్మప్పలపై కేసు నమోదు చేసి రిమాండుకు కూడా తరలించారు. ఆ తరువాత ప్రభుత్వం, విద్యాశాఖ వారిని సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల హైకోర్టు ఉపాధ్యాయుల సర్వీసు తొలగింపుపై అభ్యంతరం తెలిపిందని ఓ పత్రికలో వచ్చింది. ఉపాధ్యాయులు బందెప్ప, సమ్మప్పలతో ఎలాంటి సమగ్ర విచారణ జరుపలేదని, సోకాజ్ నోటీసులను కూడా అందించలేదని తెలిపింది. ఈ కారణంగా సర్వీసు నుంచి తొలగించినట్లు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ ఉత్తర్వులు తాత్కాళికం మాత్రమే అని స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయంతో ఇద్దరు టీచర్లకు ఊరట లభించింది. అయితే కోర్టు ఉత్తర్వులు గత నెలలులో జారీ చేయడం గమనార్హం.
ఇది కూడా చదవండి…


