వైభవంగా బొడ్రాయి ప్రతిష్టాపన
– రూ. 51 వేలు విరాళం అందించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– భారీగా తరలివచ్చిన ప్రముఖులు, భక్తులు
తాండూరు, దర్శని ప్రతినిధి : తాండూరు పట్టణంలో బొడ్రాయి(నాభిశిల) ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ప్రతిష్టాపన పూజలో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్చరణల మద్య ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బొడ్రాయికి పూజలు నిర్వహించారు. అనంతరం బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవ కమిటి సభ్యులకు తనవంతు సహాకారంగా రూ. 51 వేల నగదును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు సుభీక్షం కోసం బొడ్రాయి ప్రతిష్టాపన చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తమవంతు చేయూత ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్, సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, డాక్టర్ సంపత్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ళ నర్సింహులు, పట్లోళ్ళ బాల్ రెడ్డి, బంటు మలప్ప, కౌన్సిలర్ బోయ రవి రాజు, రాష్ట్ర యూత్ కార్యదర్శి బిర్కడ్ రఘు, ఉత్సవ కమిటి సభ్యులు నారాయణ, నర్సింహులు, పట్నం అశోక్, బర్కడ్ శివ, భాస్కర్, నర్సింహులు, నర్సింహులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు బొడ్రాయి ప్రతిష్టాపనలో పట్టణ ప్రముఖులు, భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతిష్టాపన ఉత్సవాల సందర్భంగా మధ్యాహ్నం బోనాల ఊరేగింపు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి…


