గుద్దేసీ.. పారిపోయాడు..!
– 24 గంటల్లోనే దొరికేశాడు
– వీడిన రోడ్డు ప్రమాదం మిస్టరీ
– పెద్దేముల్ పోలీసులకు జిల్లా ఎస్పీ అభినందనలు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: రెండు రోజుల క్రితం పెద్దేముల్ మండలం కందనెల్లి తాండా వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మీస్టరీ వీడింది. కర్ణాటకు చెందిన నిందితుడు తుఫాన్ వాహనంతో ఢీ కొట్టి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లో మిస్టరీని చేధించారు. మంగళవారం పెద్దేముల్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 9వ తేదీన ధారూర్ మండలం గట్టేపల్లి గ్రామానికి చెందిన కమ్మరి ప్రణయచారి తన ఆటోలో పెద్దేముల్ మండలం తడ్డెపల్లి నుంచి తాండూరు వైపు వస్తుండగా మార్గమద్యలోని కందనెల్లీ తాండా వై జంక్షన్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన తెలిసిందే. మృతుని తండ్రి సురేష్ చారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి నేతృత్వంలో విచారణ ముమ్మరం చేశారు. సీసీ పుటేజీ, టెక్నాలజీ స హాకారంతో ప్రయణచారి ప్రయాణిస్తున్న ఆటోను కర్ణాటక రాష్ట్రం జహీరాబాద్ కు చెందినది గుర్తించారు. ఎండీ అన్సారీ అనే వ్యక్తికి చెందిన తుఫాన్ (కేఏ32 బీ 3371) 9వ తేదీన రాత్రి అజాగ్రత్తగా, అతి వేగంతో నడిపి ప్రయణచారీ ఆటోను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. కేసు నమోదైన 24 గంటల్లో నిందితున్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితున్ని రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపారు. మరోవైపు కేసును 24 గంటల్లో చేధించడం పట్ల వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పెద్దేముల్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డిని, విచారణ బృందాన్ని కూడా అభినందించారు.
ఇది కూడా చదవండి…


