దూద్ బావి నీళ్లా మజాకా..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

దూద్ బావి నీళ్లా మజాకా..!
– నీళ్లు తాగితే రోగాలన్నీ మటాష్‌
– అసక్తికరంగా మారిన బావి హిస్టరీ
దర్శిని డెస్క్‌: డబ్బులు పెట్టి కొనుక్కుని తాగేన నీళ్లతో రోగాలు వస్తుంటే వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఓ భావి నీళ్లు రోగాలను దూరం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లాలోని దూద్‌ బావిగా పేరొందిన బావి నీళ్ల చరిత్ర ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో వందల ఏళ్ల చరిత్ర గల దూద్ భావి ఉంది. కాకతీయుల కాలంలో ఈ బావిని తవ్వించ్చారని చరిత్రగా చెప్పుకుంటున్నారు. అప్పటి నిజాం ప్రభువులు కూడా గుర్రాల మీద నుంచి ఈ బావి నీళ్లు తెప్పించుకుని తాగేవారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ గ్రామ ప్రజలు అలాగే చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు ఈ నీరే తాగుతున్నారు. చుట్టూ కొండలు.. ఏ కొండల పై వివిధ రకాల ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి.. ఈ మొక్కల నీళ్లన్ని ఈ బావి లోకి చేరుతాయి.. అంతే కాదు.. ఎప్పటికి ఈ నీళ్లు పాల వాలే ఉంటాయి.. కొండ పక్కనే ఉండటం తో.. మినరల్ వాటర్ కూడా పని చేయదు.

ఆ బావి నీరు స్థానికుల దాహాన్ని తీర్చడమే కాదు రోగాల నుండి నయం చేస్తుందనే నమ్మకం ఉంది. ఎవరైనా అనారోగ్యానికి గురవుతే… ఈ బావి నీళ్లు తాగుతారు. రెండు గుట్టల నడుమ ఉండడంవల్ల ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని కాళ్ల నొప్పులు కీళ్లనొప్పులు చెప్తుంటారు. కరోనా టైంలో ఈ నీరు తాగి కరోనా నుండి కాపాడుకోగలిగారు. అనారోగ్యానికి గురవుతే ఇక్కడికి వచ్చి నీళ్లు తాగుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ బావి ని చూస్తున్నారు.. ఎంత కరువు వచ్చిన ఈ బావి లో నీరు మాత్రం తగ్గదు. ఈ బావి నీటికి కూడా ఓ ప్రత్యేకత ఉంది ఫ్లోరైడ్ ఉండదు. అందుకే ఆ బావిని ఊరందరూ దూద్ భావిగా పీల్చుకుంటున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యటన ప్రాంతంగా మార్చేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage