ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్‌ న్యూస్..!

ఆరోగ్యం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్‌ న్యూస్..!
– వైద్య సేవల పరిమితి పెంపు
– డిజిటల్ కార్డుల పంపిణీకి నిర్ణయం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. అర్హులైన పేదలకు అందిస్తున్న సేవల పరిమితిని పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోద్యశాఖ మంత్రి హరీష్ రావు ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేశారు. పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యం అందించాలనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఆరోగ్య శ్రీ సేవలపై తెలంగాణ ప్రభుత్వం మరింత దృష్టి పెట్టింది. సీఎం కేసీఆర్ సర్కార్ ఎప్పటికప్పుడు పేదవాడికి అవసరం అయ్యే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లబ్దిపోందే వారి కోసం వైద్య సేవల పరిమితిని 2 లక్షల నుండి 5లక్షలకు పెంచింది. దీంతో పాటు ఆరోగ్య శ్రీ సేవల కోసం కొత్తగా డిజిటల్ కార్డ్ లని ఇవ్వనుంది హెల్త్ డిపార్ట్మెంట్. దీనికోసం ఈ kyc నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచన చేశారు. ఆరోగ్య శ్రీ సేవల లో బేమెట్రిక్ విధానం లో కొంత ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఫేస్ రికాగ్నైజేషన్ విధానం తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది వైద్య ఆరోగ్య శాఖ. మొత్తానికి ఆరోగ్య శ్రీ సేవల పెంపుపై రాష్ట్రంలోని పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage