పౌర సేవలకు ప్రాధాన్యం..!
– తాండూరు మున్సిపల్లో సిటిజన్ చార్టర్
– పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా
– పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధులపై దృష్టి
– జాతీయ జెండా ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ
– సాదాసీదాగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ పౌర సేవలకు ప్రాధాన్యమిచ్చేందుకు మున్సిపల్ పాలకవర్గం దృష్టిసారించింది. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో సిటిజన్ చార్టర్ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా పట్టణంలోని పారిశుద్ధ్యం నిర్వహణ, సీజనల్ వ్యాధుల నియంత్రణపై శ్రద్ద వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. పారిశుద్ధ్య కార్మికులకు బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు శుభవార్త ప్రకటించింది. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అధ్యక్షతన, కమీషనర్ షఫీవుల్లా ఆధ్వర్యంలో జరిగిన సమావేశం సాదాసీదా జరిగింది. మొత్తం 14 అంశాలతో ప్రవేశ పెట్టిన, ఎజెండాలో 13 అంశాలపై పాలకవర్గ సభ్యులు ఆమోదం తెలిపారు.
మున్సిపల్ నూతన కార్యాలయంలో తాండూరు అభివృద్ధికి సూచనగా శాశ్వతంగా ఏర్పాటు చేసే 30 మీటర్ల జాతీయ జెండా ఏర్పాటు అంశంపై సుదీర్ఘ చర్చ జరిపారు. అంశానికి సంబంధించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసి ప్రవేశ పెట్టి ఉంటే భాగుండేదని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీంతోపాటు తాండూరు పట్టణంలో పౌరుల ఫిర్యాదులను సులభంగా పరిష్కరించేందుకు రూ. 5 లక్షలతో సిటీజన్ చార్టర్ ఏర్పాటు చేయాలని అంశాన్ని అందరు ఆమోదించారు. ఈ వ్యవస్థతో పౌరుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించి, జవాబుదారి తనం పెంచుతామని పాలకవర్గం పేర్కొంది. అదేవిధంగా తాండూరు మన్సిపల్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 215 మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా, సదుపాయాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా తెలంగాణ ప్రబుత్వం ఆదేవాల మేరకు నిర్వహిస్తున్న హరితహారంలో భాగంగా పట్టణంలో 4 సర్సరీలను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ బడ్జెట్ కింద రూ. 30 లక్షల నిధులను కేటాయించారు. అదేవిధంగా ప్రస్తుతం వర్షాల కారణంగా పట్టణంలో పారిశుద్ధ్యం లోపించకుండా ఉండే అందుకు మున్సిపల్ వాహనాలను మరమ్మత్తులు చేసి అందుబాటులోకి తీసుకరావాలని కోరారు. దోమల నియంత్రణ కోసం బ్లీచింగ్ పౌడర్, దీమోపాన్, మాలధీన్ ఆయిల్, లైమ్ పౌడర్ చల్లించాలని కోరారు. దోమల నియంత్రణ కోసం మున్సిపల్ నుంచి కొత్తగా 4 అత్యాధునిక ఫాగింగ్ మిషన్లను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు ఏజెండాలో ప్రస్తావించారు. మొత్తంగా అన్ని అంశాలలకు పాలకవర్గ సభ్యులు ఆమోదం తెలపడంతో కౌన్సిల్ సమావేశం సాదాసీదాగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు. మాజీ వైస్ చైర్మన్లు పట్లోళ్ల రత్నమాల నర్సింలు, సాజిద్ అలీ, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, విజయాదేవి, సంగీత ఠాకూర్, సిందూజ, అబ్దుల్ రజాక్, అసిఫ్, సోమ శేఖర్, బోయరవి, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ రంగనాధం, ఏఈ ఖాజా, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


