కరణ్‌ కోట్ కానిస్టేబుల్‌కు ఎస్ఐ జాబ్

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

కరణ్‌ కోట్ కానిస్టేబుల్‌కు ఎస్ఐ జాబ్
– సన్మానించిన రూరల్ సీఐ, ఎస్ఐ
– అభినందించిన తోటి కానిస్టేబుళ్లు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోలీసు ఉద్యోగాల నియామకాలలో కానిస్టేబుళ్లు ఎస్ఐ ఉద్యోగాలను సాధించారు. ఈ జాబితాలో వికారాబాద్‌ జిల్లా తాండూరు రూరల్ పరిధిలోని కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వివరాల్లోకి వెళితే.. కోట్‌పల్లి మండలం బార్వాద్‌ గ్రామానికి చెందిన పెరుమాళ్ల లక్ష్మీకాంత్ రెడ్డి బీటెక్ పూర్తి చేశారు. 2020లో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఎస్ఐ ఉద్యోగానికి సన్నద్దమయ్యాడు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఐ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యారు. ఆదివారం ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో పెరుమాళ్ల లక్ష్మీకాంత్ రెడ్డి ఎస్ఐగా ఎంపికయ్యాడు. దీంతో సోమవారం తాండూరు రూరల్ సీఐ రాంబాబు, కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డిలు ఎస్ఐగా ఎంపికైన లక్ష్మీకాంత్ రెడ్డిని సన్మానించారు. మరోవైపు తోటి కానిస్టేబుళ్లు లక్ష్మీకాంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!