పర్యావరణ సేవ అభినందనీయం..!
– మొక్కల పరిరక్షణకు మరింత కృషి చేయండి
– కోట్రిక విజయలక్ష్మీకి ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : భర్త జ్ఞాపక స్పూర్తితో పర్యావరణ సేవ చేయడం అభినందనీయమని గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మిని అభినందించారు. కోట్రిక విజయలక్ష్మీ తన భర్త స్వర్గీయ కోట్రిక వెంకటయ్య గత ఆరేళ్ల క్రితం ఇంటి సమీపంలో ఓ మొక్కన నాటి.. కొంత కాలం తరువాత కన్నుమూశారు. అప్పటి నుంచి కోట్రిక వెంకటయ్య జన్మదినం రోజున మొక్కకు జయంతిని నిర్వహిస్తున్నారు. పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా మొక్కను తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాని కోట్రిక విజయలక్ష్మీ తన భర్త జ్ఞాపకంగా చూసుకుంటున్న మొక్కను తాండూరులోని వ్యవసాయ పరిశోధన స్థానంలోకి తరలించి అక్కడే నాటించారు. ఇటీవలే మొక్కకు 7వ జయంతిని నిర్వహించారు.
భర్త జ్ఞాపకంగా మొక్కను సంరక్షించడంతో పాటు ప్రకృతిలో మమేకం చేయడంతో పాటు కోట్రిక విజయలక్ష్మి మొక్కల సంరక్షణకు పాటు పడుతున్న విషయాన్ని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ దృష్టికి వచ్చింది. దీంతో బుధవారం ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కోట్రిక విజయలక్ష్మీకి ప్రగతి భవన్ కు పిలిపించుకున్నారు. కోట్రిక విజయలక్ష్మీని అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ భర్త జ్ఞాపకంగా చూసుకుంటున్న మొక్కను ప్రకృతిలో మమేకం చేయడం అద్భుతమని అన్నారు. ఇదే స్పూర్తితో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోట్రిక విజయలక్ష్మీకి సూచించారు. తమవంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. అదేవిధంగా ఎంపీ సంతోష్ కుమార్ చేతుల మీదుగా సన్మానం పొందడం పట్ల కోట్రిక విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణతకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోట్రిక శ్రీకాంత్, కోటం సిద్దిలింగం, సోషల్ వర్కర్ కేవీఎం వెంకట్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

