తెలంగాణ ధిశాలీ సర్వాయి పాపన్న గౌడ్
– రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్
– ఎన్ఎస్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జయంతి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎన్ఎస్పీ(నూలి శుభప్రద్ పటేల్) చారిట్రబుల్ ట్రస్టు కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధికి పోరాడిన మహనీయుడు అని అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, నాయకులు నరేష్ గౌడ్, నరేందర్ గౌడ్, శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు భాను, బాలు, శ్రీశైలం, విజయ్, సచిన్, సాయి కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

