రేసు గుర్రాలు రెడీ..!
– సిట్టింగులకే చాన్స్ ఇచ్చిన కేసీఆర్
– మహేశ్వరం నుంచి మంత్రి సబితారెడ్డి
– మెతుకు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డిలకు అవకాశం
– అధిష్టానం బుజ్జగింపుతో మహేందర్ రెడ్డి వెనుకడుగు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వచ్చే అసెంబ్లీ పోరులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రేసు గుర్రాలు పోటీకి సిద్దమయ్యారు. సోమవారం ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులో సిట్టింగులకే పోటీ చేసే అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్. మహేశ్వరం నుంచి మంత్రి సబితారెడ్డికి అవకాశం ఇచ్చారు. చేవేళ్ల నుంచి కాలే యాదయ్య, వికారాబాద్ నుంచి డా.మెతుకు ఆనంద్, పరిగి మహేశ్వర్ రెడ్డి, కోడంగల్ పట్నం నరేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలకు టిక్కెట్టు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలో ఆయా స్థానాల నుంచి టిక్కెట్టు ఆశించిన నేతలు భంగపాటుకు గురయ్యారు. ఇదిలా ఉండగా తాండూరు నియోజకవర్గం నుంచి టిక్కెట్టు కోసం ఆశించిన పట్నం మహేందర్ రెడ్డిని అధిష్టానం బుజ్జగించడంతో వెనుకడుగు వేసినట్లు స్పష్టమైపోయింది. అయితే టిక్కెట్టు రాకుంటే పార్టీ మారుతారనే జరిగిన ప్రచారం ఎటువైపు సాగుతుందో వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి…

