పీజీ ఎంట్రెన్స్‌లో సిందూ విద్యార్థిని సత్తా

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

పీజీ ఎంట్రెన్స్‌లో సిందూ విద్యార్థిని సత్తా
– రాష్ట్ర స్థాయిలో 18వ ర్యాంకు సాధించిన ఎండీ అస్రాభేగం
– అభినందించిన కళాశాల యజమాన్యం

తాండూరు, దర్శిని ప్రతినిధి: పీజీ ప్రవేశ పరీక్షలో తాండూరు సిందు డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థిని సత్తా చాటింది. బషీరాబాద్ మండలం మంతటికి చెందిన అస్రా భేగం సిందూ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇటీవల నిర్వహించిన పీజీ ఫిజిక్స్ విభాగం ఎంట్రెన్స్ పరీక్షలు రాసింది. మంగళవారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో కళాశాలకు చెందిన విద్యార్ధిని ఎండీ అస్రా భేగం సత్తాచాటింది. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 18వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపకులు వి.రంగారావు, ప్రిన్సిపల్ విజయదేవి, వైస్ ప్రిన్సిపల్ రఘునందన్ రెడ్డిలు, ఫిజిక్ లెక్చరర్ సాయి కుమార్ గౌడ్ లు ఆప్రాభేగంను అభినందించారు.

ఇది కూడా చదవండి…

గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!