రైతులను జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం
– లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి
– అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
– తాండూరులో బీఆర్ఎస్ నాయకుల నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులను జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో తాండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపు మేరకు మంగళవారం బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని
అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రంను సమర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్ధ మాజీ చైర్మన్ రాజుగౌడ్, సీనీయర్ నాయకులు పంజుగుల విఠల్ రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం లగచర్లలో ప్రభుత్వం తమ భూములుకు లాక్కుంటుంటే రైతులు ప్రతిఘటించిన పాపానికి కక్ష్య పట్టిందన్నారు. లగచర్లలో గిరిజన, దళిత, బలహీన వర్గాల రైతులను జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వంగా రేవంత్‌రెడ్డి సర్కారు నిలిచిందన దుయ్యబట్టారు. రైతులపై అప్రజాస్వామికంగా కేసులు పెట్టి, వారిని థర్డ్ డిగ్రీ టార్చర్‌కు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచక, దుర్మార్గ, నికృష్టమైన ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని అన్నారు. వెంటనే రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు సంగీత ఠాకూర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, మైనార్టీ సెల్ అధ్యక్షులు యూనుస్, మహిళ నాయకులు శకుంతల, అనురాధ, తాండూరు మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, బషీరాబాద్ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్, ఇంతియాజ్, మోయిజ్, టైలర్ రమేష్, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

