ప్రజలకు భరోసా కల్పించేందుకే కవాతు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రజలకు భరోసా కల్పించేందుకే కవాతు
– ప్రశాంతంగా ఎన్నికలను జరుపుకోవాలి
– తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్
– పురవీధుల్లో ఆర్‌ఏఎఫ్‌ ఫ్లాగ్ మార్చ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజల్లో భయాందోళన తొలగించి భద్రత, భరోసా కల్పించడమే కవాతు ధ్యేయమని తాండూరు డీఎస్పీ జీ శేఖర్ గౌడ్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్‌) 99వ బెటాలియన్ ద్వారా తాండూరు పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ (కవాతు) నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు నుంచి తాండూరు పట్టణంలోని పురవీధులో ఆర్ఏఎఫ్‌ బెటాలియన్, పోలీసులు కవాతు నిర్వహించారు. పాత తాండూరు, రైల్వే స్టేషన్, వినాయక చౌక్, గాంధీ చౌక్, భద్రేశ్వర చౌక్, బసవణ్ణ కట్ట, వీవీహెచ్ఎస్, శివాజీ చౌక్, మల్లప్ప మడిగ, మీదుగా ఇందిరా చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో డీఎస్పీ శేఖర్ గౌడ్ తో పాటు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐలు పాల్గొన్నారు. కవాతు అనంతరం డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ఉండాలని భరోసా ఇస్తూ కవాతు నిర్వహించడం జరిగిందన్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు. దీంతో పాటు వినాయక చవితితోపాటు ఇతర పండగలను అందరు సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 65 మంది ఆర్ఎఎఫ్ సిబ్బంది, ఎస్ఐలు అబ్దుల్ రవూఫ్, మధుసూదన్ రెడ్డి, కాశినాథ్, వేణుగోపాల్ గౌడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!