పైలెట్‌ను కలిసిన విశ్వబ్రాహ్మణ సంఘం
– రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కలిశారు. తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్టు సాధించుకోవడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం శాలువాతో సత్కరించారు. అదేవిధంగా వచ్చే నెల 17న తాండూరు మండలం ఖాంజాపూర్ సమీపంలో నిర్వహిస్తున్న విశ్వకర్మ పూజకు రావాలని ఆహ్వానించారు. మరోవైపు టీటీడీ బోర్డు సభ్యురాలుగా నియామకం అయిన చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతా రంజిత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గంతో పాటు పట్టణం. పలు మండలాలకు చెందిన విశ్వబ్రాహ్మణులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

