అన్నీ మతాలకు అతీతం రాఖీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అన్నీ మతాలకు అతీతం రాఖీ..!
– మత సామరస్యతను చాటిన కోట్రిక విజయలక్ష్మీ
– 9 ఏండ్లుగా మైనార్టీ సోదరునికి రాఖీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: అన్ని మతాలకు రాఖీ పండగ అతీతమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంటకయ్య నిరూపిస్తున్నారు. ప్రతి యేడాది రాఖీ పండగ సందర్భంగా మైనార్టీ సోదరునికి రాఖీ కట్టి సోదర బంధం పవిత్రను చాటుతున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటైన మున్సిపల్‌ పాలకవర్గంలో కోట్రిక విజయలక్ష్మీ చైర్ పర్సన్‌గా, వైస్ చైర్మన్‌గా సయ్యద్‌ సాజిద్‌లు కొనసాగారు. అప్పటి నుంచి ప్రతి యేడాది జరిగే రక్షాబంధన్‌ పండగ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మీ సాజిద్ అలీకి రాఖీ కడుతున్నారు. తొమ్మిదేండ్లుగా రాఖీ కట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా గురువారం కోట్రిక విజయలక్ష్మీ నివాసంలో సయ్యద్ సాజిత్ అలీతో పాటు కౌన్సిలర్ ముక్తార్ నాజ్, మైనార్టీ సోదరులకు రాఖీ కట్టారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోట్రిక విజయలక్ష్మీ సాజిద్ అలీ, తదితరులకు మొక్కలను అందజేశారు. మత్య సామరస్యతను చాటుతున్న బంధానికి అందరు అభినందనలు తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!