ముదిరాజ్ లను గుర్తించిన వారికే మద్దతు
– అందరి ఐక్యతను చాటేందుకు అలయ్ బలయ్
– ముదిరాజ్ చైతన్య వేదిక రథయాత్రలో నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో ముదిరాజ్లను గుర్తించిన వారికే మద్దతు అందించాలని చైతన్య వేదిక సమావేశంలో తీర్మానించారు. తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే కేటాయింపులో జరుగుతున్న కుట్రలపై చైతన్య పరిచేందుకు చేపట్టిన ముదిరాజుల చైతన్య వేదిక రథయాత్ర శనివారం తాండూరుకు చేరుకుంది. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని జగదాంబ టవర్స్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి చైతన్య వేధిక కార్యవర్గ సభ్యులు శివ ముదిరాజ్, మహిళ నాయకురాలు కోట్ల పుష్పలత ముదిరాజ్, రమేష్, బీఎస్పీ నాయకులు బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం అత్యధికంగా ఉన్న ముదిరాజ్ లు అన్ని పార్టీలలో కీలకంగా ఉన్నారని అన్నారు. అలాంటి ముదిరాజ్ లను కాదని ఆయా పార్టీలు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో ముదిరాజ్ ఐక్యతను చాటుకునేందుకు ఆయా పార్టీల ల నుంచి అత్యధికంగా సీట్లను సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. వచ్చే ఎన్నికల్లో ముదిరాజ్ లను గుర్తించే పార్టీలకు మద్దతు ఇవ్వాలన్నారు.
అదేవిధంగా ముదిరాజ్ ల ఐక్యతను, సంస్కృతిని, సంప్రదాయాన్ని చాటేందుకు వచ్చే నెల 1వ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి జయప్రదయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్పీ రవికుమార్, లొంక నర్సింలు, అల్లాపూర్ శ్రీకాంత్, బంటు వేణుగోపాల్, బీరప్ప, మల్లప్ప, అంబ్రేష్, జర్నప్ప, ఇందూరు వెంకట్, నరేందర్. రాములు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

