రైతులు, వ్యాపారుల అభివృద్ధికి కృషి చేయాలి
– గ్రేన్ అసోసియేషన్ కు అండగా ఉంటాం
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్
– ఘనంగా అసోసియేషన్ ప్రమాణ స్వీకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులు, వ్యాపారులు అభివృద్ధికి కృషి చేయాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సస్ స్వప్న పరిమళ్, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ లు అన్నారు. సోమవారం తాండూరు దిగ్రేవ్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. పట్టణంలోని సల్లా గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ లు హాజరయ్యారు. వారి సమక్షంలో అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా వెంకట్రాములు గౌడ్, ఉపాధ్యక్షులుగా బి.శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా పటేల్ కిరణ్, సంయుక్త కార్యదర్శిగా సీహెచ్ భోజిరెడ్డి, కోశాధికారిగా బి. కృష్ణ, కార్యవర్గ సభ్యులుగా పటేల్ రాంరెడ్డి, సల్లా దామోదర్, బంటారం సుధాకర్, దినేష్ సింగ్ ఠాకూర్, కట్కం వీరేందర్, మంకాల రవీందర్, మల్లెపల్లి మధుసూదన్, రాజేష్ సోని, శంభుని నర్సింలు, జి.మల్లప్ప యాదవ్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నాయన్నారు. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో రూ. 30 కోట్లతో కొత్త మార్కెట్ యార్డు నిర్మాణం చేసుకోబోతున్నామన్నారు. గంజ్‌లోని కార్మికులకు డబుల్ బెడ్ రూం, గృహలక్ష్మి పథకాల్లో ప్రాధాన్యమివ్వడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ రైతులకు, వ్యాపారుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అసోసియేషన్ కు అండగా ఉంటామన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణరెడ్డి, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నాగారం నర్సింలు, మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేశ్వరి, బీఆర్ఎస్ యువనాయకులు రొంపల్లి సంతోష్ కుమార్, అసోసియేషన్ సభ్యులు, వ్యాపారులు, సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
అసోసియేషన్ సభ్యులకు సన్మానం

మరోవైపు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ అధ్యక్ష, కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా బీఆర్ఎస్ యువనాయకులు రొంపల్లి సంతోష్ కూడా సన్మానించారు.
ఇది కూడా చదవండి…

