భద్రేశ్వరుని అనుగ్రహంతోనే అన్నదాన సత్రం
– స్లాబ్ నిర్మాణానికి ఘనంగా పూజలు
– పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి
– మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం భద్రేశ్వర దేవాలయంలో స్వామి అనుగ్రహంతో అన్నదాన సత్రం నిర్మాణం జరుగుతోందని పలువురు అన్నారు.శుక్రవారం దేవాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న అన్నదాన సత్రంకు స్లాబ్ నిర్మాణ పూజ చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ లు పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రేశ్వర దేవాలయంలో అన్నదాన సత్రంతో భక్తులకు నిత్య అన్నదానం అందుబాటులోకి రావడం శుభపరిణామం అని అన్నారు. భద్రేశ్వరుని చెంత అన్నదానం కార్యక్రమంతో దేవాలయానికి ప్రతిష్ట పెరుగుతుందన్నారు. త్వరలోనే అన్నదాన సత్రం పూర్తి చేసేందుకు అందరు తమవంతు తోడ్పాటు అందిచాలన్నారు.

ఈ కార్యక్రమంలో భావిగి భద్రేశ్వరుని వారసులు శివకుమార్ స్వామి, దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, వీరశైవ సమాజం కార్యదర్శి లింగదలి రవికుమార్, వీరశైవ యువదళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

