మూడో ముహుర్తం ఖరారు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మూడో ముహుర్తం ఖరారు..!
– రేపు తాండూరుకు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే
– విలియమూన్ చౌరస్తా నుంచి ర్యాలీ
– ఈ సారి అదొక్కటే చేంజ్..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో తెలంగాణ రాష్ట్ర సమాచార, గనుల, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డిలకు స్వాగతం పలికేందుకు ముచ్చటగా మూడో ముహుర్తం ఖరారయ్యాయింది. రేపు తాండూరులో వారికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గనుల, భూగర్బ, సమాచార మంత్రిగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టడం, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థిగా టిక్కెట్టు ఖరారు అయిన తరువాత తొలిసారి తాండూరుకు వచ్చేస్తున్న సందర్భంలో ర్యాలీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి సారి గత నెలలో నిర్వహించాల్సి ఉండగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. రెండో సారి ఈనెల 3న ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. కాని అప్పుడు భారీ వర్షాల కారణంగా రద్దు అయ్యింది. ఈ సారి రేపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు దాదాపు 10 వేల మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా తాండూరు రైల్వే స్టేషన్ చౌరస్తాలో సన్మాన సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కావున ఈ ర్యాలీ, సభలకు పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అయితే గతంలో రెండు సార్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భోజనాలు ఏర్పాటు చేశారు. కానీ ఈ సారి మాత్రం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో భోజనాలను ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!