గ్రామాలకు బస్సులు నడపండి

తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రామాలకు బస్సులు నడపండి
– ఆర్టీసీ డీఎంతో తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలోని గ్రామాలకు బస్సులను నడపాలని ఆర్టీసీ డిపో మేనేజర్ ను జెడ్పీటీసీ గౌడి మంజుల కోరారు. తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సమతను జెడ్పీటీసీ గౌడి మంజుల కలిశారు. మండలంలోని చెంగోల్, చింతామణి పట్నం, పర్వతాపూర్ గ్రామాల మీదుగా బస్సులు నడవక పోవడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చాలా రోజుల నుంచి సమస్య ఉండడంతో అవస్థతలు తప్పడం లేదన్నారు. గ్రామాలకు బస్సులు నడిపించే విధంగా చూడాలని కోరారు. ఇందుకు డీఎం స్పందించి సోమవారం నుంచి బస్సులు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు జెడ్పీటీసీ గౌడి మంజుల తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గౌడి వెంకటేశం ఉన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!