ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపిన చైర్ పర్సన్ దంపతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర రవాణా శాఖ మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ గుప్త, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ భర్త పరిమళ్ గుప్తతో కలిసి
హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, సీనీయర్ నాయకులు జుబేర్ లాల, మసూద్, కౌన్సిలర్ ముక్తార్ నాజ్, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, బీదర్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

