ఘనంగా యాసవారి పెళ్లిసందడి..!
– నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
– భారీగా తరలివచ్చిన ప్రజా ప్రతనిధులు, నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండల సీనీయర్ పాత్రికేయులు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ యాస వెంకట్రామ్ రెడ్డి వారి ఇంట్లో పెళ్లి సందడి ఘనంగా జరిగింది. వెంకట్రామ్ రెడ్డి, ఇందిరల కనిష్ట పుత్రుడు నవీన్ రెడ్డి వివాహము నవ్యరెడ్డితో హైదరాబాద్ కర్మాన్‌ఘాట్ లోని వంగ అనంత్ రెడ్డి గార్డెన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార, గనుల, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఆయన సోదరుడు కోడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోదరుడు నరసింహారెడ్డి(బాబు), బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీశైల్ రెడ్డి, బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, బషీరాబాద్ సీనియర్ నాయకులు అజయ్ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు రాజు(నర్సిరెడ్డి) ఎంపిటిసిల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి, నియోజకవర్గ మహిళా కన్వీనర్ శకుంతల దేశ్‌ముఖ్ పాండే, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, తాండూరు వ్యవసాయ శాఖ ఏడి రుద్ర మూర్తి, పిఆర్టియు నేతలు నర్సిరెడ్డి, నాగప్ప, ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస చారి, జిల్లా రిపోర్టర్ శివకుమార్, ఏబీఎన్ రిపోర్టర్ నర్సింలు, రిపోర్టర్లు రామ్ రెడ్డి, తలారి గోపాల్, లక్ష్మారెడ్డి, గౌతపూర్ వెంకటేష్, సంగమేష్, అంతారం బీఆర్ఎస్ నాయకులు రాజు పటేల్, ఎంపీటీసీలు వసంత్ కుమార్, శాంతుకుమార్, మంత్రి మహేందర్ రెడ్డి పిఆర్ఓ మల్లారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు అధికారులు, బంధుమిత్రులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఇది కూడా చదవండి..

