నిరుద్యోగులతో చెలగాటం తగదు
– మిని డీఎస్సీ కాదు, మెగా డీఎస్సీని ప్రకటించాలి
– తాండూరులో నిరుద్యోగుల ర్యాలీ విజయవంతం
– మద్దతు తెలిపిన సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో సర్కారు నిరుద్యోగులతో చెలగాటం ఆడడం తగని చర్య అని తాండూరు సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు ధ్వజమెత్తారు. శనివారం డీఈడీ, బీఈడీ అభ్యర్థులు సంఘం, నిరుద్యోగుల, విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వ సుజాత, కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తదితరులు మద్దతు తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు అనుకూలంగా ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5,089 టీచర్ పోస్టులను విరమించి అసెంబ్లీలో ప్రకటించిన 13,086 పోస్టులతో పాటు ఉద్యోగ విమరణ బదిలీలతో ఏర్పడిన ఖాళీలతో మొత్తం 23,065 పోస్టులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. మిని డీఎస్సీ కాదు, మెగా డీఎస్సీని ప్రకటించి తీరాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులతో చెలగాటం ఆడే విధంగా వ్యహరించడం, తగదన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగుల సంఘం నాయకులు శివకుమార్, విద్యార్థి సంఘం నాయకులు దీపక్ రెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణ చారీ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, బీసీ సంఘం నాయకులు మతీన్, సురేందర్, డీఎస్సీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

