పోస్టాఫీసులో ఆధార్ సేవల పునఃప్రారంభం
– సద్వినియోగం చేసుకోండి: ఇనుస్పెక్టర్ దౌలత్‌భాష
తాండూరు, దర్శిని ప్రతినితి: తాండూరు పట్టణంలోని పోస్టాఫీసులో ఆధార్ సెంటర్ పునఃప్రారంభమయ్యింది. శుక్రవారం నుంచి ఈ సేలను ప్రారంభమయ్యాయి. గతంలో కొనసాగిన ఆధార్ కేంద్రాన్ని వివిధ కారణాల వల్ల నిలిపివేశారు. మళ్లీ పునఃప్రారంభించిన ఆధార్ కేంద్రంలో పేర్ల, చిరునామా, పుట్టిన తేదిల మార్పిడితో పాటు మోబైల్ నెంబర్లకు ఆధార్ లింక్ చేసుకునే సేవలను అందించనున్నట్లు పోస్టాఫీసు ఇనుస్పెక్టర్ దౌలత్‌భాష తెలిపారు. పనిదినాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధార్ సేవలను అందించడం జరుగుతుందని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
