ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
– మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
– స్వచ్ఛత హిసేవా కార్యక్రమం ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బుధవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం నిర్వహించారు. మున్సిపల్ కమీషనర్ యాదగిరి జాతీయజెండాను ఎగురవేశారు.
kvcs
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్లు, అధికారులు జెండా వందనం సమర్పించారు. మరోవైపు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. కమీషనర్ యాదగిరి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కమీషనర్ మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు వారం రోజుల పాటు జరుగుతాయని, ఇందులో అందరు భాగస్వాములు కావాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అన్నారు.

అదేవిధంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, విజయ దేవి, సోమశేఖర్, ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, బోయరవి, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈ ఖాజా హుస్సేన్, ఉదయ్ కుమార్, ఇంచార్జ్ శానిటరీ ఇను స్పెక్టర్లు ఉమేష్, వెంకటయ్య, ఈఈ ప్రవీణ్ గౌడ్, టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రియ, టీఎంసీ రాజేంద్రప్రసాద్, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు, పలు విభాగాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి…

జీలకర్ర నీరు.. ఆరోగ్యానికి అమృతం..!