ప్రజా నాయకుడు పట్నం మహేందర్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రజా నాయకుడు పట్నం మహేందర్ రెడ్డి
– మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన బిర్కడ్ రఘు
– యువనేతలతో కలిసి మంత్రికి సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డిపై యువ అభిమానం ఏమాత్రం తగ్గలేదు. శనివారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ యువనాయకులు మంత్రి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాండూరకు చెందిన బీఆర్ఎస్‌వై రాష్ట్ర నాయకులు బిర్కడ్ రఘు ఆధ్వర్యంలో యువనేతలు మహేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. జన్మదినం సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డికి భారీ గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిడ్కర్ రఘు మాట్లాడుతూ మంత్రి మహేందర్ రెడ్డి ప్రజా నాయకుడు అని అభివర్ణించారు. తాండూరు ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి వెంట నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు దత్తు, పునీత్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు