రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే..!
– పేదల కోసమే ఆరు గ్యారెంటీ పథకాలు
– తాండూరులో కాంగ్రెస్ నేతల విస్తృత ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ఖాయమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదల కోసం గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతుందని తాండూరు కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆదివారం యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్యారెంటీ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు.
పట్టణంలోని పాత తాండూరులో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్,. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అమీర్ అబ్దుల్లా, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఆరు గ్యారెంటీ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే తుక్కుగూడలో కాంగ్రెస్ అధినేత్రి ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు గృహలక్ష్మీ, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, యువ వికాసం, చేయూత వంటి పథకాలను అమలు చేసి పేదలను ఆదుకుంటుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అనితా రెడ్డి, ఖయ్యూం, నవాజ్, రాజుగౌడ్, నారా అశోక్, వడ్డె శ్రీనివాస్, బలరాం, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడ చదవండి..

