కొనుగోళ్ళ కాంగ్రెస్..!
– ఫంక్షన్ హాల్ వేదికగా వ్యవహారాలు
– పోయినోళ్లంతా పదవులకు, పార్టీకి రిజైన్ చెయ్యాలి
– తాండూరు కారులో పైలెట్ దే గెలుపు
– జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కొనుగోళ్ల పార్టీగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల కొనుగోళ్లే లక్ష్యంగా పనిచేస్తుందని ధ్వజమెత్తారు. తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలోని ఎస్వీఆర్ గార్డెన్ ను కొనుగోలు కేంద్రంగా మార్చిందనిఅన్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ఆఫర్లు ఇస్తూ కొనుగోలు చేస్తున్నారని అన్నారు.
సర్పంచులు, కౌన్సిలర్లు స్వార్థం కోసమే కొంతమంది కాంగ్రెస్ పార్టీలోనే చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి టిఆర్ఎస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. 9ఏండ్లుగా పార్టీ నుంచి పదవులు, ఇతర లబ్దిలి పొంది.. ఇప్పుడు పార్టీని విమర్శించడం సమంజసం కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీపై, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. స్వార్థం కోసం వెళ్ళిన నేతలంతా పార్టీకి, పదవులకు రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. గతంలో మంత్రి మహేందర్ రెడ్డి రూ. 18 వేల కోట్లతో అభివృద్ధి చేస్తే, ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్ రెడ్డి రూ. 1600 కోట్లతో అభివృద్ధి చేశారాని గుర్తుచేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మంత్రి మహేందర్ రెడ్డి, తాండూరు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. తాండూరు కారులో పైలెట్ గెలుపు ఖాయం అన్నారు. ఖచ్చితంగా 50వేల మెజారిటీ విజయం సాధిస్తారని దీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..

