అమ్మ గొంతు నొక్కిన అప్పులు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అమ్మ గొంతు నొక్కిన అప్పులు..!
– తల్లిని హత్య చేసిన కుమారుడు
– మృతదేహాన్ని మూటలో కట్టి చెరువులో పడేసిన వైనం
– మూడు రోజుల తర్వాత సంఘటన వెలుగులోకి
తాండూరు, దర్శిని ప్రతినిధి: అవసరాల కోసం కొడుకు చేసిన అప్పులుతల్లి గొంతు నొక్కేలా చేశాయి. అప్పు ఎందుకు చేసావని తల్లి నిలదీయడంతో ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు కుమారుడు. మృతదేహాన్ని మూటలో కట్టి చెరువులో పడేశాడు. మూడు రోజుల తరువాత సంఘటన వెలుగులోకి వచ్చింది. బషీరాబాద్ మండలంలో ఈ సంఘటన కలకలం రేపింది. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కాశింపూర్ గ్రామానికి చెందిన అంజిలమ్మ (45) కుమారుడు వెంకటేష్ హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. ఇటీవల పండగ కోసం గ్రామానికి వచ్చాడు. అయితే ఈ విషయం తెలుకున్నా కొందరు మూడు రోజుల క్రితం వేంకటేష్ చేసిన అప్పుల గురించి తల్లి అంజిలమ్మను అడిగారు. దీంతో ఇంటికి వచ్చిన వెంకటేష్ ను తల్లి నిలదీసింది. కోపోద్రికుడైన వెంకటేష్ తల్లీ గొంతు నొక్కి హత్య చేశాడు. అనంతరం వెంకటేష్  తన స్నేహితుడుతో కలిసి మృత దేహాన్ని మూటలో కట్టి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో పడేశాడు. రెండు రోజులుగా అంజిలమ్మ కనిపించడం లేదని వెంకటేష్ పెదనాన్న కుమారుడు అతని నిలదీయడంతో తల్లిని హత్య  చేసినట్లు చెప్పేశాడు. విషాన్ని పోలీసులకు తెలపడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొనిచెరువులో నుంచి అంజలి మృతయాన్ని బయటకు తీశారు. మూడు రోజుల తర్వాత సంఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో కలకలం రేపింది. పోలీసులుదర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత