పైలెట్‌కు ఖచ్చితంగా మద్దతిస్తాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్‌కు ఖచ్చితంగా మద్దతిస్తాం..!
– బీసీల అభ్యున్నతిపై తోడ్పాటు అభినందనీయం
– రోహిత్ రెడ్డితో మార్పు వస్తుందని దీమా
– ఆర్. కృష్ణయ్య కుమారుడు డా. అరుణ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఖచ్చితంగా మద్దతు ఇస్తామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్య సభ సభ్యులు ఆర్. కృష్ణయ్య కుమారుడు, బీసీ నాయకులు డా. అరుణ్ కుమార్ అన్నారు శనివారం తాండూరుకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో మీడియాతో సమావేశం అయ్యారు. ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డికి మద్దతు విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నామన్నారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రూ. 2 కోట్లతో 2 ఎకరాలలో సమీకృత బీసీ భవన నిర్మాణానికి కృషి చేయడం గొప్ప విషయమన్నారు.

అదేవిధంగా పదవుల్లో, అభివృద్ధిలో ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. బీసీ చట్టసభల్లో రిజర్వేషన్ మద్దతుపై అడడగా వెంటనే మద్దతిస్తామని ప్రకటించారని అన్నారు. అన్నీ బీసీ కులాలు చట్టసభల్లోకి రావాలనే అభిప్రాయం వ్యక్తం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్. కృష్ణయ్య ఏపీ సీఎంకు మద్దతు ఇస్తే బీసీల రిజర్వేషన్ పై బిల్లు పెట్టిన వి షయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు పైలెట్ రోహిత్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. బీసీల అభ్యున్నతిపై పైలెట్ రోహిత్ రెడ్డి అందిస్తున్న తోడ్పాటు పట్ల ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు మద్దతు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. పైలెట్ రోహిత్ రెడ్డి వల్ల బీసీ సామాజిక విప్లవంలో జిల్లాలో, రాష్ట్రంలో మార్పు వస్తుందని దీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మండల అధ్యక్షులు నరేందర్, మహిళ అధ్యక్షురాలు నాయికోడి జ్యోతి, అనిత, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..