బీఆర్ఎస్ కుట్రలు సాగవు
– డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
– కాంగ్రెస్‌లో చేరిన 100 మంది యువకులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో బీఆర్ఎస్ కుట్రలు సాగవని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన తాండూరు మండలం చెంగోల్ గ్రామ యువకులు తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. బుధవారం చెంగోల్ కు చెందిన యువనాయకులు రాము యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది యువకులు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. మనోహర్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను మభ్యపెట్టే బీఆర్ఎస్ కుట్రలు సాగవన్నారు. ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, నేతలు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

