తాండూరు క్రీడాకారులకు బంగారు, వెండి పతకాలు
– సౌత్ ఇండియా కుంగ్ఫూ, కరాటే చాంపియన్‌షిప్‌లో సత్తా
– అభినందించిన మాస్టర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన కుంగ్‌ఫూ, కరాటే క్రీడాకారులు బంగారు, వెండి పథకాలను సాధించారు. ఇందులో నలుగురు క్రీడాకారులు నాలుగు బంగారు పథకాలు, మరో ఇద్దరు వెండి పతకాలను సాధించి సత్తా చాటారు. ఇటీవల కొందుర్గులోని జీఎం పటేల్ గార్డెన్లో 37వ సౌత్ ఇండియా కుంగ్‌పూ, కరాటే చాంపియన్ షిఫ్ పోటీలు జరిగాయి. ఈ పోటీలో తాండూరు మాస్టర్ జపాన్ చోటోకాన్, కరాటే విద్యార్థులు పింకీ, మణికంఠ, ఎండీ అజహర్, మిక్కీలు ప్రతిభను కనబరిచి ఒక్కొక్కరు మొత్తం నాలుగు బంగారు పతకాలను సాధించారు. అదేవిధంగా లక్కీ, ఎండీ జహూర్లు రెండు వెండి పతకాలను సాధించారు. దీంతో పాటు మాస్టర్ బీవీ మోహనకృష్ణ ఒక గ్రాడ్ చాంపియన్ షిఫ్ గెలుపొందారు. ఈ సందర్భంగా సీనియర్ మాస్టర్ బీవీ సాయికుమార్ విద్యార్థులను అభినందించారు. మరోవైపు తాండూరులో ఆసక్తి ఉన్న క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, పూర్తి వివరాలకు సెల్: 9848743067, 8217418147లకు సంప్రదించాలని తెలిపారు.
ఇది కూడా చదవండి..

