నేరాలకు పాల్పడితే జీవితాలు నాశనం

కెరీర్ క్రైం తాండూరు వికారాబాద్

నేరాలకు పాల్పడితే జీవితాలు నాశనం
– ఫోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
– తాండూరు న్యాయమూర్తి శివలీల
తాండూరు, దర్శిని ప్రతినిధి: నేరాలకు పాల్పడితే జీవితాలు నాశనం అవుతాయని తాండూరు సివిల్ జడ్జ్ న్యాయమూర్తి శివలీల అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఫోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తాండూరు మండల లీగల్ సర్వీసెస్ ఆథారిటీ ఆధ్వర్యంలో గురువారం తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి శివలీల హాజరై మాట్లాడారు. పోక్సో చట్టంపై విద్యార్థులు, తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలన్నారు.

విద్యార్థులు చదువు మీదనే దృష్టి ఉంచాలని, నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు డిఎస్పీ శేఖర్ గౌడ్, రూరల్ సీఐ రాంబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మఠం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పాశం రవికుమార్, కళాశాల కార్యదర్శి ఉత్తమ్ చంద్, ప్రిన్సిపల్ సత్యానంద్, న్యాయవాదులు అగ్గనూర్ జగదీశ్వర్, పి.గుండప్ప, కె. శ్రీనివాస్, కె.రవీందర్, బి.రవికుమార్, కె. విశ్వనాథ్, కమలాకర్, రవీందర్, బందెప్ప, మహిళ న్యాయవాదులు వాణిశ్రీ, రజిత, అనిత, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..