రోహిత్ రెడ్డి మాటిస్తే తప్పడు

తాండూరు రాజకీయం వికారాబాద్

రోహిత్ రెడ్డి మాటిస్తే తప్పడు
– ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించాలి
– ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణి అర్తి రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజల కోసం మాటిస్తే తప్పదని ఆయన సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 12వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్తి రెడ్డి మున్సిపల్ చైర్ వైస్ పర్సన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారీలతో కలిసి ప్రచారం చేశారు. గడప గడపకు వెళ్లి.. బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభివృద్ధి. సంక్షేమ కరపత్రాలను పంచి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆర్తి రెడ్డి మాట్లాడుతూ గతంలో తాండూరులో కాలుష్యాన్ని నియంత్రిస్తానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హామి ఇచ్చారని. దానికి కట్టుబడి తాండూరును కాలుష్య రహితంగా మార్చారని గుర్తుచేశారు.

ప్రజల కోసం మాటిస్తే తప్పకుండా నెరవేరుస్తారని అన్నారు. తాండూరు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్, నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..