ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
– ఎన్నికల సాధారణ అబ్జర్వర్ అకాష్
– తాండూరులో కేంద్రాల పరిశీలిన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సాధారణ అబ్జర్వర్ ఆకాష్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం సాయిపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. స్థానిక ఎన్నికల సిబ్బందితో కలిసి పోలింగ్ కేంద్రాలలో కావాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్. తాగునీరు. వాష్ రూమ్స్, ర్యాంపులు ఇతర మౌళిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాని స్పష్టం చేశారు. ఆయన వెంట స్థానిక ఎన్నికల అధికారులు. బీఎల్ ఓలు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

