హ్యాండ్ బ్యాగులో నోట్ల కట్టలు..!
– రాంగ్ రూట్లో వచ్చి దొరికిన రవాణా దారులు
– భారీ మొత్తాన్ని సీజ్ చేసిన పోలీసులు
– తాండూరు పట్టణంలో సంఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : హ్యాండ్ బ్యాగులో నోట్ల కట్టలు దాచుకుని వెళుతున్న వ్యక్తులు రాంగ్ రూట్లో వెళ్లి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారి వద్ద లభించిన భారీ మొత్తాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన మంగళవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం మారేపల్లిలోని సుమిత్ర కాటన్ మిల్లుకు చెందిన వినయ్ గార్డ్, వీరారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు రెండు హ్యాండ్ బ్యాగులో సుమారు రూ. 40 లక్షల నగదును బైకుపై తరలిస్తున్నారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద రాంగ్ రూట్లో వెళుతున్న వీరి బైకును తనిఖీలో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.
అనుమానంతో బ్యాగులను సోదా చేయగా అందులో రూ.50ల నోట్ల కట్టలు, రూ.100ల నోట్ల కట్టలు, రూ.500ల నోట్ల కట్టలు కనిపించాయి. వారిని పోలీస్టేషన్ కు తరలించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులను తరలించడం పట్ల మొత్తాన్ని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. స్క్రీనింగ్ కమిటికి సీజ్ చేసిన నగదును అందజేస్తామన్నారు. ఈ ఎన్నికల కోడ్ లో ఇంత మొత్తం సీజ్ చేయడం ఇదే మొదటిసారి అన్నారు. అయితే డబ్బులను ఎక్కడి తగిలిస్తున్నారనే దానిపై విచారణ చేపడుతున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి…

