బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు
– ఆహ్వానించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలంకు చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం బీఆర్ఎస్ యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తూర్పు నర్సింహారెడ్డి, ఎస్ఐఐసీ కుర్వ కిష్టప్పలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజీ అధ్యక్షులు విఠల్ నాయక్, నాయకులు అక్బర్ బాబ, మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, నాయకులు కృష్ణకుమార్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!