తాండూరుపై కుట్రను అడ్డుకోవాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరుపై కుట్రను అడ్డుకోవాలి
– ఎన్నికల్లో ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి
– క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి నిధులు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఆకట్టుకున్న యాక్టర్ నోయల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పరాయి వ్యక్తుల నుంచి తాండూరుపై జరగుతున్న కుట్రను క్రైస్తవ సోదరులు అడ్డుకోవాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి తాండూరు పట్టణంలోని వెంకోబా గార్డెన్లో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సమావేశానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు సీని యాక్టర్, ర్యాపర్ నోయల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లలో తాండూరులోని క్రైస్తవులకు అండదండలు అందించడం జరిగిందన్నారు. వారి మద్దతుతోనే గత ఎన్నికల్లో గెలిచానని అన్నారు. ఈ సారి కూడా ఎన్నికల్లో గెలిపిస్తే మరింత తోడ్పాటు అందిస్తానని అన్నారు. తాండూరులో క్రిస్టియన్ భవన్ కోసం రూ. 50 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, మరో రూ.50లక్షలు మంజూరయ్యేలా చూస్తానని అన్నారు. మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలు నాపై ఉండాలన్నారు.

అదేవిధంగా ఎన్నికల నేపథ్యంలో తాండూరుకు వచ్చిన పరాయి వ్యక్తులు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. వారి కుట్రలను క్రైస్తవ. సోదరులు అడ్డుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే తాండూరును మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా మారుస్తానని అన్నారు. మరోవైపు సమావేశానికి హాజరైన యాక్టర్ నోయల్ క్రైస్తవ సోదరులను ఆకట్టుకునేలా ప్రసంగించారు. తనదైన శైలిలో అందరిని ఆకర్షించారు.

ఈ కార్యక్రమంలో బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు. ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి, పాస్టర్లు, మత పెద్దలు, క్రైస్తవులు, మహిళలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!