ఘనంగా సునీతమ్మ జన్మదినం
– ఎంసీహెచ్‌లో అల్పహారం పంపిణీ
– పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. శనివారం బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బిర్కడ్ రఘు ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. సునీతా మహేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మతా శిశు ఆసుపత్రితో పాటు తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఆల్పహారం పంపిణీ చేశారు.
ఆసుపత్రులలోని రోగులతో పాటు బందువులకు అల్పహారాన్ని అందజేశారు. అనంతరం సునీతా మహేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ యువ నాయకులు జగదీష్ మోచ్చి, సిద్దు అయ్యా, జగదీష్ అయ్యా, నర్సింహ, నాని, మోహన్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

