అమోద.. అయోమయం..!
– ఎజెండాకు కొందరి మద్దతు.. ఇంకొందరి తిరస్కరణ
– గందరగోలంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ నూతన కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశం ఆద్యంతం ఆమోద అయోమయంగా కొనసాగింది. ఎజెండా అంశాలపై కొందరు మద్దతు తెలపగా.. ఇంకొందరు తిరస్కరించారు. దీంతో సమావేశంపై గందరగోళం ఏర్పడింది. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎమ్మెల్యేతో పాటు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రవేశ ఎట్టిన అంశాలను చదువే సమయంలోనే కొందరు టీఆర్ఎస్ కౌన్సిలర్లు, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఎజెండాను ఆమోదిస్తున్నట్లు ఆమోద పత్రాన్ని అందజేశారు. దీనిపై చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కొందరు కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ సంతకం లేకుండానే ఎజెండాను ప్రవేశ పెట్టడం.. ఆమోదించడంపై తిరస్కరణ చేశారు. చైర్ పర్సన్ సూచించిన అంశాలను ప్రవేశ పెట్టలేదని, ఎజెండాను రద్దు చేసి మూడు రోజుల తరువాత మళ్లీ సమావేశాన్ని నిర్వహించాలని కోరుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ | ఎజెండా అంశంపై సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ కమీషనర్ను ఆదేశించారు. అదేవిధంగా అభివృద్ధికి అందరు కౌన్సిలర్లు పాటు పడాలని, తాండూరు మున్సిపల్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, టీఆర్ఎస్ ఫ్లోరీడర్ శోభారాణి, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ శ్రీనివా మున్సిపల్ స్ రెడ్డి, టీజేఎస్ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్, సీపీఐ ఫ్లోర్ లీడర్ ఆసిఫ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజగౌడ్, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఎజెండాను అంగీకరించలేదు : చైర్ పర్సన్ స్వప్న
సమావేశం అనంతరం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశ పెట్టిన ఎజెండాను ఆమోదించలేదని పేరొ క్కున్నారు.
తన సంతకం లేకుండా ఎజెండాను రూపొదించడంపై అధికారుల తీరును తప్పు పట్టారు. ఎజెండాను రద్దు చేయాలని మున్సిపల్ చట్టం 40/2. ప్రకారం మెమోరండం అందించడం జరిగిందని, దీనిపై చర్యలు తీసుకోకుంటే ఉన్నతాధికారులతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు.
మెజార్టీ సభ్యుల మద్దతుతో ఎజెండా ఆమోదం : ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్
కౌన్సిల్ సమావేశంలో ప్రవేశ పెట్టిన 48 అంశాల ఎజెండాకు మెజార్టీ కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారని ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ స్పష్టం మున్సిపల్ చట్టం 216 ద్వారా 6 నిబంధనల మేరకు మెజార్టీ సభ్యుల ఆమోదంతో ఎజెండాను ఆమోదించడం జరిగిందన్నారు.
అయితే మున్సిపల్ ఎజెండాపై చైర్ పర్సన్ సంతకం లేదని చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. రెండు, మూడు సార్లు ఎజెండాపై సంతకం కోసం చైర్ పర్సను సంప్రదిస్తే తిరస్కరించడం జరిగిందని, 24 గంటల తరువాత చైర్ పర్సన్ సంతకం లేకున్నా ఎజెండా ప్రవేశ పెట్టవచ్చని చట్టంలో ఉందన్నారు. ఈ మేరకు ఎజెండాను ప్రవేశ పెట్టగా 36 మంది కౌన్సిలర్లలో 25 మంది మెజార్టీ కౌన్సిలర్లు ఆమోదం తెలిపారని వివరించారు. ఎజెండాను రద్దు చేయాలని చైర్ పర్సన్ అందించిన అభ్యర్థనపై జిల్లా కలెక్టర్, సీడీఎంఏ అధికారులకు నివేదిక అందిస్తామని పేర్కొన్నారు.

