కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి మద్దతు
– ఆశీర్వాద సభలో గ్రైన్ మర్చంట్స్ అసోసియేషన్
– కాంగ్రెస్ పార్టీలో చేరిన దడువై కార్మికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డికి మద్దతు ఇస్తామని ది గ్రైన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ నేతలు అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని ఓ వేదికలో ది గ్రైన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేసన్ తో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డికి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి గంజ్ వ్యాపారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలిస్తే అండగా ఉంటానని అన్నారు.
మరోవైపు నెహ్రు గంజ్ లో దడుపై కార్మిక సంఘం అధ్యక్షులు హన్మంతు ఆధ్వర్యంలో గంజ్ కు చెందిన దడుపై కార్మికులు మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదల సంక్షేమం సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం అందరు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్ సంపత్ కుమార్, అసోసియేషన్ సభ్యులు, వ్యాపారులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

