కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ లేదు

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ లేదు
– ఎన్నికల్లో ఎమ్మెల్యేను గెలిపించండి
– ప్రచారంలో రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ లేదని, సంక్షేమాన్ని అందించే బీఆర్ఎస్ పార్టీనే ఆదరించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తాండూరు పట్టణంలోని 13వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరుపున ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపు కోసం, ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్తి రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సాధించిన కరపత్రాలను పంచి పెట్టారు. ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.

అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ హామిలకు గ్యారెంటీ లేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సహాకారంతో తాండూరు. అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి రోహిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్, కౌన్సిలర్ విజయాదేవి, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!