కాంగ్రెస్ కుట్రలకు బలికావొద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ కుట్రలకు బలికావొద్దు..!
– హస్తంకు ఓటేస్తే పదేండ్లు వెనక్కి
– కారు గుర్తుకు ఓటేయండి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– పెద్దేముల్ మండలంలో ఎన్నికల ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుపై కుట్రలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ పార్టిని నమ్మి బలికావద్దని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దేముల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం ఉచిత విద్యుత్, రైతుబందు, రైతుబీమా, ఆసరా ఫించన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీముభారక్ పథకాలను అమలు చేస్తుందన్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పథకాన్ని కట్ అయి పోతాయన్నారు. సీఎం కేసీఆర్ సహాకారంతో మీ కండ్ల ముందే అభివృద్ధి చేశానని అన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ దీపాలు, మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తాండూరు అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీపై కుట్రలకు పాల్పడుతుందన్నారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేస్తే పదేండ్లు వెనక్కి పోతామన్నారు. మన వేలితో మన కన్నునే పోడుచుకోవద్దని, ఆగం కాకుండా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్ యాదవ్, డీవై నర్సింలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!