ఎంతో చేసా.. అవకాశమిస్తే మరింత చేస్తా
– బీఆర్ఎస్ పార్టీ వస్తేనే మళ్లీ సంక్షేమం
– కాంగ్రెస్ పార్టీని నమ్మితో దగా రాజ్యమే
– ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించండి
– కరణ్ కోట్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ సర్కారు సహాకారంతో తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, మళ్లీ అవకామిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణీ ఆర్తిరెడ్డితో కలిసి హాజరయ్యారు. ప్రచారంలో భాగంగా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పదేండ్లలో పేదల కోసం ఆసరా, కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్, రైతు బందు, రైతుబీమా, గృహలక్ష్మీ, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమా పథకాలతో పాటు గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ సర్కారు సహాకారంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల. అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. ఈ సారి కూడా అవకాశం కల్పిస్తే మరింత సంక్షేమం. అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత గ్యారెంటీ పథకాలతో మభ్యపెట్టేందుకు వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే మళ్లీ దగా పడతామన్నారు. కాంగ్రెస్ పార్టీని తరిమి కారు గుర్తుకు భారీ మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు.
కరణ్ కోట్ గ్రామంలో సాగిన ప్రచారంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, సతీమణి ఆర్తిరెడ్డిలకు గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీణ హేమంత్ కుమార్, ఉపసర్పంచ్ హేమంత్ కుమార్, ఎంపీటీసీ వసంత్ కుమార్, బీఆర్ఎస్ యువ నాయకులు బోయ అశోక్ కుమార్ నేతలు, కార్యర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

