ఇంటిని తగలబెట్టిన ఫ్రిజ్..!
– మంటలకు కాలి బూడిదైన వస్తువులు
– నిద్రలో నుంచి గమనించడంతో తప్పిన ప్రమాదం
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంట్లో ఉన్న ఫ్రిజ్ షాక్ సర్య్కూట్‌కు గురై ఇంటిని తగులబెట్టింది. నిద్రలో నుంచి లేచి దంపతులు గమనించడంతో ప్రాణాపాయం తప్పింది.

ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని 36వ వార్డులో చంద్రశేఖర్, స్వరూప దంపతులు వారింట్లో నివసిస్తున్నారు. రోజూ మాదిరిగానే రాత్రి ఇంట్లోనే నిద్రించారు. మంగళవారం తెల్లవారు జాము సమయంలో ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌కు షాక్ సర్క్యూట్ రావడంతో మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో నిద్రలో నుంచి లేచిన స్వరూప గమనించి భర్తను నిద్రలేపింది.

ఇంట్లో పోగలు వ్యాపించడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి బోరు మోటార్ ద్వారా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపు కాకపోవడంతో తాండూరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదంతో కుటుంబం దిక్కుతోచని స్థితికి చేరుకుంది. ఫించన్ పై ఆధారపడి ఉంటున్న వారికి అగ్ని ప్రమాదం కోలుకోలేని దెబ్బతీసింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదికూడాద చదవండి…

