నేతలూ.. ఓటేశారు..!
– ఓటేసిన మంత్రి మహేందర్ రెడ్డి
– స్వగ్రామంలో కుటుంబంతో ఓటేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– తాండూరులో ఓటు వేసిన మనోహర్ రెడ్డి దంపతులు
– ఓటింగ్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేతలు ఓటింగ్లో పాల్గొని ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఎన్నికల్లో మాదిరిగానే రాష్ట్ర గనుల, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తాండూరులో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుమారుడు రినీష్ రెడ్డి,. కూతురు మనిషా రెడ్డిలతో కలిసి మహేందర్ రెడ్డి ఓటు వేశారు. జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి యాలాల మండలంలో ఓటు వేశారు. బషీరాబాద్ మండలం స్వగ్రామైన ఇందర్ చెడ్ లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అతని సతీమణి ఆర్తి రెడ్డి, తల్లి జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, తండ్రి విఠల్ రెడ్డి, సోదరుడు రితేష్ రెడ్డిలు ఓటు వేశారు.
కాంగ్రెస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుయ్యని మనోహర్ రెడ్డి పట్టణంలోని సాయిపూర్ ప్రభుత్వ నెంబర్ వన్ పాఠశాలలో సతీమణి అరుణమ్మతో కలిసి ఓటు వేశారు. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ భర్త పరిమళ్ గుప్తతో కలిసి తాండూరు పట్టణంలో ఓటు హక్కు వి నియోగించుకున్నారు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్ యాలాల మండలంలో ఓటు వేయగా ఆమె భర్త డాక్టర్ సంపత్ కునూర్, కుమారులు తాండూరు పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ ఆర్డీఓ కార్యాలయ వెనుక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వియోగించుకున్నారు. వారితో పాటు పట్టణానికి చెందిన కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, రాజకీయ నేతలు, ప్రముఖులు పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇది కూడా చదవండి…

