గుట్టుగా గంజాయి విక్రయాలు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

గుట్టుగా గంజాయి విక్రయాలు..!
– బీహారి కూలీ వద్ద 3కిలోల స్వాదీనం
– అరెస్టు, రిమాండుకు తరలింపు
– వివరాలు వెల్లడించిన ఏఈఎస్ శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : గుట్టుగా గంజాయి విక్రయిస్తున్న బీహారి కూలీని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

బుధవారం వికారాబాద్‌ జిల్లా అసిస్టెంట్‌ ఎక్సైజ్ సూపరిండెంట్(ఏఈఎస్) శ్రీనివాస్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు మండలం గౌతాపూర్ సమీపంలోని ఓ పాలిషింగ్‌ యూనిట్లో బీహార్‌ రాష్ట్రంకు చెందిన ఎండి ముస్తకిమ్ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అయితే అతను గుట్టుగా గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది.

వికారాబాద్‌ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ కె.విజయభాస్కర్, అసిస్టెంట్ సూపరిడెంట్‌ శ్రీనివాస్ రెడ్డిల ఆదేశాల మేరకు తాండూరు ఎక్సైజ్ సీఐ రాని, ఎస్ఐ రవికుమార్, బృందం దాడులు నిర్వహించారు. నిందితుడు ముస్తకిమ్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి సుమారు రూ. 90వేల విలువైన 3.6కేజీల ఎండు గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. నిందితుడు బీహార్‌ నుంచే గంజాయిని తీసుకవచ్చి ఇక్కడ విక్రయాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని ఏఈఎస్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది భీమయ్య, రవికిశోర్, రమేష్, రాజేందర్, మహేష్, సతీష్ పాల్గొన్నారు.

25వ వార్డులో సమస్యలు పరిష్కరించండి