పడిపోయిన పోలింగ్..!
– ఓటర్లు ఉన్న పెరగని శాతం
– అవగాహన కల్పించిన అంతంతే నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పడిపోయినట్లుగా కనిపిస్తుంది. నియోజకవర్గ వ్యాప్తంగా నమోదైన ఓటింగ్ శాతం ఇదే చెబుతోంది. తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం మొత్తం 2 లక్షల 36 వేల 76 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళ ఓటర్లు 1లక్ష 20వేల 927. పురుషులు 1లక్ష 15వేల 143 మంది ఓటర్లు ఉన్నారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్, తాండూరు పట్టణంలో పోలింగ్ కొనసాగింది. ఉదయం మందకొ డిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి పుంజుకుని, సాయంత్రం సమయానికి ఊపందుకుంది.
తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌లో పాటు తాండూరు పట్టణంలో ఆశించిన మేర పోలింగ్ జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 77శాతం పోలింగ్ శాతం అయినట్లు గుర్తుచేశారు. ఈ సారి జరిగిన ఎన్నికల్లో గురువారం సాయంత్రం 5 గంటల వరకు పోయేవరకు 71 శాతంగా ప్రకటించారు. 5గంటలు దాటినా పోలింగ్ కేంద్రంలోపల ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరి ఉండడంతో శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. కాని 76 శాతం వరకే నమోదైంది. ఈ సారి యువకులు భారీ ఎత్తున ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. యువత ఓటు వేసినా.. పాత ఓటర్లు ఓటు వేయనట్లుగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి…

